విద్యుత్ వినియోగంలో ఆల్టైమ్ హై.. జిల్లాల్లోనూ భారీగా పెరిగిన లోడ్!
హైదరాబాద్, 07 మార్చి (హి.స.) రాష్ట్రంలో ఒక వైపు ఎండల తీవ్రత పెరగడం, మరోవైపు రబీ పంటల సాగు జోరందుకోవడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వ్యవసాయ అవసరాలకు తోడు గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో వినియోగం పెరగడంతో విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ రికా
కరెంటు రికార్డు


హైదరాబాద్, 07 మార్చి (హి.స.)

రాష్ట్రంలో ఒక వైపు ఎండల తీవ్రత పెరగడం, మరోవైపు రబీ పంటల సాగు జోరందుకోవడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వ్యవసాయ అవసరాలకు తోడు గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో వినియోగం పెరగడంతో విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ రికార్డు స్థాయికి చేరుతోంది. ఈ నెల 3వ తేదీన రాష్ట్రంలో మొత్తం విద్యుత్ డిమాండ్ 18,139 మెగావాట్లకు చేరి కొత్త రికార్డు నమోదైంది. అదే సమయంలో టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో శుక్రవారం గరిష్ఠ డిమాండ్ 11,129 మెగావాట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే రోజున ఈ డిమాండ్ 10,310 మెగావాట్లుగా ఉండగా, ఈసారి అది గణనీయంగా పెరగడం గమనార్హం.

గ్రేటర్ పరిధిలోనూ పెరిగిన డిమాండ్...

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఈ నెల 3న 4,421 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది. රනි పంటల సాగు కొనసాగుతున్న జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ వినియోగం అధికంగా ఉండటంతో పాటు ఎండల కారణంగా గృహ వినియోగం సైతం పెరుగుతోంది. జిల్లాల వారీగా డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గరిష్ఠ డిమాండ్ 2,459 మెగావాట్లు నమోదవగా, మహబూబ్నగర్ జిల్లాలో 2,326 మెగావాట్లు, మెదక్ జిల్లాలో 2,181 మెగావాట్లు నమోదయ్యాయి.

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని

వినియోగదారులకు నిరంతర సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి.పాటిల్ తెలిపారు. 33 కేవీ, 11 కేవీ ఫీడర్లు, సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్ల లోడును నిరంతరం పర్యవేక్షించాలని క్షేత్రస్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande