
హైదరాబాద్, 07 మార్చి (హి.స.)మాజీ సీఎం జగన్ , గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం ఇచ్చిన మద్య నిషేధం హామీ గురించి ప్రస్తావిస్తూ.. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మంత్రి లోకేశ్ సంచలన పోస్ట్ చేశారు. ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని తన ట్వీట్కు అటాచ్ చేసిన మంత్రి.. 2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చిన ‘మద్య నిషేధం’ హామీ వెనుక ఇదే నిజమైన స్టోరీనా అంటూ వ్యాఖ్యలు చేశారు.
ప్రతి నెలా వంద కోట్ల రూపాయల కిక్బ్యాగ్స్, 3 వేల 500 కోట్లు మనీ లాండరింగ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెలికితీసిన రూ.1048 కోట్ల నగదు లావాదేవీల జాడ ఎక్కడ’ అని ప్రశ్నించారు. ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని తన ట్వీట్కు అటాచ్ చేసిన లోకేశ్...‘2019 ఎన్నికల్లో జగన్ మీరు ఇచ్చిన మధ్య నిషేధం హామీ వెనుక ఇదే నిజమైన స్టోరీనా. మీరు మధ్య నిషేధం గురించి ప్రసంగిస్తూ ఉండగానే ఆంధ్రప్రదేశ్లో అక్రమ మద్యం వేలాది కుటుంబాలను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నాశనం చేసింది. ఇదే టైంలో మీ అనుచరుల జేబులు వేలకోట్ల రూపాయిలతో నిండిపోయాయి. ఏపీ ప్రజలకు మీరు సమాధానం చెబుతారా? లేక మౌనంగా ఉండడమే మంచిది అనుకుంటున్నారా’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్కు #LiquorScamByJagan, #ScamStarJagan హ్యాష్ట్యాగ్లను మంత్రి లోకేశ్ ట్యాగ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్