ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు..
భద్రాద్రి కొత్తగూడెం, 07 మార్చి (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆసుపత్రికి చేరుకున్న ఆయన.
Mla


భద్రాద్రి కొత్తగూడెం, 07 మార్చి (హి.స.)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని

దమ్మపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని

శనివారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆసుపత్రికి చేరుకున్న ఆయన.. అక్కడి పరిస్థితులను, రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని సిబ్బంది హాజరు పట్టికలను, రికార్డులను ఎమ్మెల్యే క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ మణిదీప్తో మాట్లాడుతూ ఆసుపత్రిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ఆసుపత్రికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర సామాగ్రి తదితర వివరాలతో ఒక నివేదికను అందజేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు, ఆసుపత్రికి కావాల్సిన సదుపాయాల జాబితాతో కూడిన లేఖను సిద్ధం చేసి అందజేస్తామని డాక్టర్ మణిదీప్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande