నేడు సీఎం రేవంత్ సమక్షంలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు
భారీ సంఖ్యలో మావోయిస్టులు నేడు లొంగిపోనున్నారు
Maoist


హైదరాబాద్, 07 మార్చి (హి.స.)130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నట్లు సమాచారం. ఆయుధాలతో సహా వీరంతా జనజీవన స్రవంతిలో కలవనున్నారు. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం సరెండర్ కానున్నట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించి సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటు కానుంది. వీరిలో మావోయిస్టు సుప్రీం గణపతి లేనట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande