RBI కొత్త గైడ్లైన్స్.. డిజిటల్ ఫ్రాడ్కు 85% వరకు పరిహారం..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సరికొత్త ముసాయిదా
RBI


ఢిల్లీ, 07మార్చి (హి.స.)డిజిటల్ ఫ్రాడ్స్ (ఆన్‌లైన్ మోసాలు) బారిన పడి డబ్బులు కోల్పోయిన బ్యాంక్ కస్టమర్లకు ఊరటనిచ్చేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సరికొత్త ముసాయిదా మార్గదర్శకాలను (Draft Guidelines) విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, బాధితులు కోల్పోయిన మొత్తంలో 85 శాతం వరకు లేదా గరిష్టంగా ₹25,000 పరిహారంగా పొందే అవకాశం ఉంది.

RBI కొత్త ప్రతిపాదనలు – ప్రధానాంశాలు:

పరిహారం మొత్తం: చిన్న తరహా డిజిటల్ మోసాల్లో (Small-value frauds) కస్టమర్లు కోల్పోయిన నెట్ లాస్‌లో 85% వరకు పరిహారం అందుతుంది. అయితే ఈ పరిహారం గరిష్టంగా ₹25,000 కు మాత్రమే పరిమితం చేయబడింది. (ఉదాహరణకు: మీరు ₹20,000 కోల్పోతే, అందులో 85% అంటే ₹17,000 పరిహారం వస్తుంది. ఒకవేళ ₹50,000 కోల్పోతే, 85% మొత్తం ₹42,500 అయినప్పటికీ, గరిష్ట పరిమితి ప్రకారం మీకు ₹25,000 మాత్రమే లభిస్తుంది).

ఎవరికి వర్తిస్తుంది? : సుమారు ₹50,000 లోపు జరిగే డిజిటల్ లావాదేవీల మోసాలకు ఇది వర్తిస్తుంది. దాదాపు 65% ఆన్‌లైన్ ఫ్రాడ్స్ ఈ కేటగిరీలోనే ఉంటున్నాయని RBI గుర్తించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande