జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మాక్వానాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మాక్వానా రాజమండ్రిలో శనివారం విసృత్తంగా పర్యటించారు. ఈపర్యటనలో కిషోర్ మాక్వానా.. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Kishore


హైదరాబాద్, 07 మార్చి (హి.స.)జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మాక్వానా ఈరోజు(శనివారం) రాజమండ్రిలో విసృత్తంగా పర్యటించారు. ఈ పర్యటనలో కిషోర్ మాక్వానా.. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాజమండ్రిలోని ఓఎన్జీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఓఎన్జీసీ అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. సమావేశం జరుగుతున్న సమయంలోనే కిషోర్ మాక్వానా అస్వస్థతకు గురయ్యారు.

ఈ సమావేశంలో ఉండగానే ఆయనకు వాంతులు కావడంతో వెంటనే అధికారులు స్పందించి సమీపంలోని డెల్టా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు సమాచారం. అధికారులు వెంటనే స్పందించడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కిషోర్ మాక్వానా చికిత్స పొందుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande