
కరీంనగర్, 07 మార్చి (హి.స.)
అరకొర వసతులతో ఏర్పడిన నూతన మండలం గన్నేరువరంకు, జిల్లా కేంద్రానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడం డబుల్ రోడ్డు సమస్య తీరకపోవడంతో సతమతం అవుతున్న మండల ప్రజానీకానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఎన్నికల హామీ మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం.
కేంద్ర మంత్రి ఇచ్చిన మాట ప్రకారం రూ.77 కోట్ల నిధులతో మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పూర్తి చేసి నిధులు మంజూరు చేసినప్పటికీ మూడు మండలాల చిరకాల కలల బ్రిడ్జి ఏ గ్రామంలో నిర్మితం అవుతుందో అంతు పట్టని పరిస్థితి ఏర్పడింది. మా గ్రామంలో అంటే మా గ్రామంలో నిర్మాణం చేపట్టాలని చొక్కారావు పల్లి, గన్నేరువరం, మైలారం గ్రామస్తులు బ్రిడ్జి జేఏసీ నాయకులు సర్పంచులు పోటాపోటీగా ఆర్ అండ్ బీ ఈఈ కి వినతి పత్రాలు అందజేస్తూ వారి ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
మొదట చొక్కా రావు పల్లె వద్ద జిల్లా కలెక్టర్ పరిశీలన...
మానేరు నదిపై బ్రిడ్జి అతి తక్కువ దూరంతో చొక్కారావు పల్లె గ్రామం వద్ద నుంచి కాజీపూర్ వరకు నిర్మాణం చేయడానికి అనుకూలమైన స్థలమని అప్పటి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, ఆర్అండ్బీ అధికారులతో కలిసి పరిశీలన చేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టడానికి అనుమతులు అందజేశారు. శంకుస్థాపన చేపట్టకపోవడంతో కాలక్రమమైన కొత్త డిమాండ్లు ఊపందుకున్నాయి.
మైలారం మైసమ్మ గుట్ట నుంచి లారెల్ హై స్కూల్ వరకు నిర్మించాలని మానేరు పై బ్రిడ్జి నిర్మాణం మైలారం మైసమ్మ గుట్ట నుంచి జిల్లా కేంద్రం లోని లారెల్ హై స్కూల్ వరకు చేపట్టాలని దశాబ్ద కాలంగా బ్రిడ్జి జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం జరుగుతుండగా ఎట్టకేలకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టడానికి కేంద్ర మంత్రి నిధులు మంజూరు చేయడం ఆ బ్రిడ్జి కాస్త చొక్కా రావు పల్లె వద్ద నిర్మాణం జరుగుతుందని అధికారులు సర్వే చేపట్టడంతో మైలారం వద్దనే నిర్మించాలని ఇటీవల మండల సర్పంచులు తీర్మానాలు అందజేసి ఆర్అండ్్బ ఈఈని కలిసి బ్రిడ్జి నిర్మాణానికి మైలారమే సరైన ప్రదేశమని ఇక్కడే నిర్మించాలని కోరారు.
మైలారం నుంచి బ్రిడ్జి నిర్మాణం చేపడితే జిల్లా కేంద్రానికి తొందరగా చేరుకునే వెసులుబాటు ఉంటుందని, కార్పొరేషన్ తో సంబంధం ఏర్పడుతుందని సర్పంచులు, గ్రామస్తులు అధికారులను కోరినట్టు సమాచారం. మైలారం గ్రామం ముంపు గ్రామం అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నదని, ఇక్కడ వేల ఎకరాల ముంపు భూమి నిరూపయోగంగా ఉన్నదని బ్రిడ్జి నిర్మాణం చేపట్టి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవచ్చని, ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లికార్జున స్వామి ఆలయం, సమ్మక్క సారక్కలతోపాటు, కాసింపేట మానసా దేవి ఆలయానికి నేరుగా చేరుకునే వెసులుబాటు ఉంటుందని మైలారం గ్రామస్తులు, మండల సర్పంచులు విశ్వసిస్తున్నారు. వారి సమ్మతిని తెలియజేస్తూ తీర్మాన పత్రాలు కూడా అందజేశారు
మైలారం గ్రామం నుంచి కాకుండా గన్నేరువరం మండల కేంద్రం నుంచి ఎలగందులకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గన్నేరువరం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు పాలకవర్గం సభ్యులు ఆర్ అండ్ బీఈ ఈ నీ కలిసి వినతి పత్రం అందజేశారు. మండల కేంద్రం అభివృద్ధిలో భాగంగా ఈ బ్రిడ్జి నిర్మాణం గన్నేరువరం మీదుగా సాగాలని ఇక్కడి గ్రామస్తుల డిమాండ్. మైలారం వద్ద నీటి లోతు ఎక్కువగా ఉంటుందని గతంలో అధికారులు అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం కుదరదని రిపోర్టు ఇచ్చినప్పటికీ మరల గ్రామాల సర్పంచుల తీర్మానాలు మైలారం నుంచి చేయాలని కోరడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
బ్రిడ్జి నిర్మాణం గ్రానైట్ వ్యాపారులకు అనుకూలమా ప్రజలకా?
చొక్కారావు పల్లి నుంచి కాజీపూర్ వరకు, గన్నేరువరం నుంచి ఎలగందుల కు బ్రిడ్జి నిర్మాణం చేపడితే కేవలం గ్రానైట్ వ్యాపారులకే భారీ వాహనాలు పోవడానికి అనుకూలం అవుతుందని ప్రజలకు పెద్దగా ప్రయోజనం ఉండదని దూర భారం ఎక్కువనే ఉంటుందని కొందరు ప్రజలు బాహాటంగా వ్యతిరేకిస్తున్నారు. మైలారం నుంచి అయితే గ్రానైట్ వ్యాపారులకు భారీ వాహనాలకు అనుకూలత ఉండదు. కేవలం ప్రజా జీవనానికి అనుకూలంగా ఉంటుందని మరి కొంతమంది వాదిస్తున్నారు..
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు