విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: ములుగు జిల్లా కలెక్టర్
ములుగు, 07 మార్చి (హి.స.) ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ ది
Collector


ములుగు, 07 మార్చి (హి.స.)

ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 99 రోజులు నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ దివాకర టి.ఎస్. ప్రభుత్వ హాస్టల్ తనిఖీ చేసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారి నుంచి తోపుకుంట వరకు ఏర్పాటు చేసిన రోడ్డు విస్తరణ పనులలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సిహెచ్ మహేందర్ జి, ఆర్డీవో వెంకటేష్, ఎలక్ట్రిసిటీ డి ఈ ఈ నాగేశ్వరరావు, మున్సిపాలిటీ కమిషనర్ రమేష్, ములుగు తహసీల్దార్ విజయ భాస్కర్, విద్యాలయ ప్రిన్సిపాల్ నర్మదా భాయ్, మున్సిపాలిటీ వార్డ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande