మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నాం: రేవంత్రెడ్డి
మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. జేఎన్టీయూ ఆడిటోరియంలో ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు.
Revanth reddy


హైదరాబాద్, 07 మార్చి (హి.స.)మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. జేఎన్టీయూ ఆడిటోరియంలో ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు.

‘‘మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నాం. వారు ఆర్థికంగా బలపడాలనే ఆలోచనతోనే మహిళాశక్తి పథకం తీసుకొచ్చాం. మహిళలపై ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉంది. వారి ప్రాధాన్యం గుర్తించి పార్టీలో పదవులు ఇస్తున్నాం. ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలే యజమానులు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. సోషల్ మీడియాలో మహిళలను వేధించే ఘటనలు తాజాగా పెరుగుతున్నాయి. వాటిని కట్టడి చేయాలి ’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్రెడ్డి, నగర పోలీసు కమిషనర్ సజ్జనార్, సినీ నటుడు సాయి దుర్గతేజ్ తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande