వైసిపి.హయంలో ప్రతి నెల రూ.100 కోట్ల క్విక్. బ్యాక్ లు
అమరావతి, 08 మార్చి (హి.స.)ప్రతినెలా రూ.100 కోట్లు కిక్ బ్యాక్లు... రూ.3,500 కోట్ల మనీ లాండరింగ్... రూ.1048 కోట్ల అక్రమ ఆర్థిక లావాదేవీలు... ఇదా మీ 2019 మద్య నిషేధం హామీ వెనుక ఉన్న నిజమైన కథ వైఎస్ జగన్..!’ అని మంత్రి లోకేశ్ ప్రశ్నించారు. వైసీపీ హయాం
వైసిపి.హయంలో ప్రతి నెల రూ.100 కోట్ల క్విక్. బ్యాక్ లు


అమరావతి, 08 మార్చి (హి.స.)ప్రతినెలా రూ.100 కోట్లు కిక్ బ్యాక్లు... రూ.3,500 కోట్ల మనీ లాండరింగ్... రూ.1048 కోట్ల అక్రమ ఆర్థిక లావాదేవీలు... ఇదా మీ 2019 మద్య నిషేధం హామీ వెనుక ఉన్న నిజమైన కథ వైఎస్ జగన్..!’ అని మంత్రి లోకేశ్ ప్రశ్నించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఈడీ తాజా నివేదికలోని అంశాలను ప్రస్తావిస్తూ లోకేశ్ ఎక్స్లో స్పందించారు. ‘మీరు మద్య నిషేధం గురించి ప్రవచనాలు చెబుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో చట్టవిరుద్ధ మద్యం వేలాది కుటుంబాలను నాశనం చేసింది. మరోవైపు మీ సన్నిహితుల జేబులు రూ.వేల కోట్లతో నిండిపోయాయి. మీ మద్యం దోపిడీపై ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్తారా? లేక రక్షణ కోసం మౌనాన్నే ఆశ్రయిస్తారా?’ అని లోకేశ్ ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande