16 వ అఖిల భారత పోలీస్ కమాండ్ పోటీల్లో నాలుగు ప్రతిష్టాత్మక పథకాలు
అమరావతి, 08 మార్చి (హి.స.): హరియాణాలోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) క్యాంపస్లో జరిగిన 16వ అఖిల భారత పోలీస్ కమాండో పోటీల్లో రాష్ట్ర పోలీసు కమాండో దళం నాలుగు ప్రతిష్ఠాత్మక పతకాలు సాధించింది. ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కమాండో జట్లు సమష్
16 వ అఖిల భారత పోలీస్  కమాండ్ పోటీల్లో నాలుగు ప్రతిష్టాత్మక పథకాలు


అమరావతి, 08 మార్చి (హి.స.): హరియాణాలోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) క్యాంపస్లో జరిగిన 16వ అఖిల భారత పోలీస్ కమాండో పోటీల్లో రాష్ట్ర పోలీసు కమాండో దళం నాలుగు ప్రతిష్ఠాత్మక పతకాలు సాధించింది. ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కమాండో జట్లు సమష్టిగా ఈ ట్రోఫీలు గెలుచుకున్నాయి. దేశంలోనే ఉత్తమ పోలీసు కమాండో జట్టు, బ్లాక్ హాక్, రణనీతి ట్రోఫీలతో పాటు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు కాంస్య పతకం సాధించాయి. ఈ పోటీల్లో అన్ని రాష్ట్రాల పోలీసు, కేంద్ర సాయుధ బలగాలు పాల్గొన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande