కర్నూలు జిల్లా నీ ఆస్పరి మండలం కలపర్రి గ్రామ శివారులో చిరుతపులి సంచారం
కర్నూలు 08 మార్చి (హి.స.),:కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలం కలపర్రి గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామ పరిసరాల్లోని కొండలు, పొలాల ప్రాంతంలో చిరుత కనిపించిందని తెలియడంతో స్థానిక రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని రో
కర్నూలు జిల్లా నీ ఆస్పరి మండలం  కలపర్రి గ్రామ శివారులో చిరుతపులి సంచారం


కర్నూలు 08 మార్చి (హి.స.),:కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలం కలపర్రి గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామ పరిసరాల్లోని కొండలు, పొలాల ప్రాంతంలో చిరుత కనిపించిందని తెలియడంతో స్థానిక రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా రాత్రి సమయంలో చిరుత సంచరిస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు. గ్రామ శివారులో ఉన్న కొండ ప్రాంతాల్లో ఈ చిరుత పులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. కొందరు రైతులు పొలాలకు వెళ్లిన సమయంలో దూరంగా చిరుత కనిపించిందని చెబుతున్నారు. మరికొందరు గ్రామస్థులు రాత్రి వేళల్లో పశువుల దగ్గర అనుమానాస్పద శబ్దాలు వినిపించాయని తెలిపారు. దీంతో గ్రామంలో భయనక వాతావరణం నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande