
అమరావతి, 08 మార్చి (హి.స.)గద్దర్ అవార్డులపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు( )కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన మహానాయకుడు నందమూరి తారక రామారావు పేరిట తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఎంపిక కావడం ఆనందదాయకమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా రంగానికి చిరంజీవి చేసిన సేవలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ