
అమరావతి, మేడికొండూరు 08 మార్చి (హి.స.) పర్వతారోహణ సాహోసపేతమైన ప్రక్రియ. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. అయినప్పటికీ 28 ఏళ్ల ఆ యువకుడు రెండు దఫాల్లో 12 వేలు, 22 వేలు అడుగులు ఎత్తులోని పర్వాతాలను అధిరోహించి సత్తా చాటారు. నగరంలోని సంగడిగుంటకు చెందిన రహీం డిగ్రీ చదివారు. ప్రస్తుతం అతడు అటవీశాఖ అనుమతితో పేరేచర్ల నగరవనంలో జిప్లైనర్ పర్యవేక్షణ పనులు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఘన్సైదా, మహబూబ్బీ. తల్లి గృహిణి. తండ్రి ఆర్మీలో పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. చిన్నప్పటి నుంచి రహీం పర్వతారోహణలో మంచి పేరు తెచ్చుకుని మౌంటైనర్గా గుర్తింపు తెచ్చుకోవాలని ఆశయంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.--------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ