
అమరావతి, 08 మార్చి (హి.స.)
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుకు భారీ విరాళం అందింది. విశాఖకు చెందిన ఎన్ఆర్ఐలు త్రిపురనేని వెంకటరత్నం, మాధురి దంపతులు ఆదివారం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం అందించారు. అదేవిధంగా ఆయన కుమారులు త్రిపురనేని విజయ్, వినయ్ కూడా ఎస్వీ ట్రస్టుకు రూ.20 లక్షలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల ప్రతినిధి పొట్లూరి నరసింహారావు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఆయన వెంట తితిదే బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ