నేడు బమృక్ ఉద్దౌలా చెరువును ప్రారంభించనున్న సీఎం రేవంత్
బతుకమ్మ కుంటను పునరుద్ధరించి అందరి ప్రశంసలు పొందిన తెలంగాణ ప్రభుత్వం మరో చెరువుకు జీవం పోసింది. ఓల్డ్ సిటీలోని బమృక్ ఉద్దౌలా చెరువును నేడు( మార్చి 08) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
River


హైదరాబాద్, 08 మార్చి (హి.స.)బతుకమ్మ కుంటను పునరుద్ధరించి అందరి ప్రశంసలు పొందిన తెలంగాణ ప్రభుత్వం మరో చెరువుకు జీవం పోసింది. ఓల్డ్ సిటీలోని బమృక్ ఉద్దౌలా చెరువును నేడు( మార్చి 08) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇవాళ రాత్రి 7:30 గంటలకు ఈ చెరువును సీఎం ప్రారంభించనున్నారు.

ఈ చెరువు ఓల్డ్ సిటీకి తలమానికంగా ఉంది. అలానే 450 ఏళ్ల చరిత్రను కలిగి ఉంది. ఈ చెరువును రూ.9 కోట్లతో పూర్తి చేశారు. 30 ఎకరాల విస్తీర్ణంలో బమృక్ ఉద్దౌలా చెరువును తెలంగాణ అభివృద్ధి చేసింది. చెరువు చుట్టూ ఇన్లెట్లు, ఔట్లెట్లు సహా కీలక నిర్మాణాలు చెపట్టింది. ఈ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్లు, లైటింగ్, పిల్లల ప్లే ఏరియాలు, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. అలానే ఈ ప్రాంతంలో భద్రత కోసం ఏర్పాటు చేస్తున్న సీసీటీవీ కెమెరాల ద్వారా హైడ్రా(HYDRA) ప్రధాన కార్యాలయం నుంచి నిరంతరం మానిటరింగ్ జరుగనుంది.

1770లో నిజాం ప్రధాని నవాబ్ రుక్న్ ఉద్దౌలా ఈ చెరువును నిర్మించారు. అప్పట్లో ఈ చెరువు 100 ఎకరాలకు పైగా విస్తరించి ఉండేది. ఈ చెరువులోని నీటిని ఒకప్పుడు సుగంధ ద్రవ్యాల తయారీకి ఉపయోగించేవారని స్థానికులు చెబుతున్నారు. గడిచిన 50 ఏళ్లలో ఆక్రమణలతో ఈ చెరువు రూపు రేఖలు కోల్పోయింది. ఈ చెరువు కబ్జాకు గురై.. భారీగా నిర్మాణాలు.. కొత్తగా కాలనీలు వెలిశాయి. రెండేళ్ల క్రితం హైడ్రా ఈ చెరువు ప్రాంతంలో ఆక్రమణలు తొలగించి సుందరీకరణ పనులు ప్రారంభించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande