రైతు సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉంది: బండి సంజయ్
రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Bandi sanjay


హైదరాబాద్, 08 మార్చి (హి.స.)రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈరోజు(ఆదివారం)మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్, రైతుల వసతి గృహాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ.1.50000 కోట్లు కేటాయించారని ప్రస్తావించారు. ఆరోగ్యవంతమైన సమాజం తయారు కావాలంటే సేంద్రీయ వ్యవసాయం కొనసాగించాలని సూచించారు. సేంద్రీయ వ్యవసాయంతోనే ఆరోగ్య దేశం సాకారమవుతుందని తెలిపారు. దేశంలో 60 కోట్ల మంది రైతులు ఉండగా.. రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్నారని ప్రస్తావించారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande