పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ: అడిషనల్ కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం, 08 మార్చి (హి.స.) గ్రామాల్లో పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సిబ్బందికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్యా చందన సూచించారు. జిల్లాలోని ఇల్లందు మండలంలో పలు పంచాయతీలను ఆదివారం ఆమె పరిశీలించారు.
Batradri


భద్రాద్రి కొత్తగూడెం, 08 మార్చి (హి.స.) గ్రామాల్లో పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సిబ్బందికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్యా చందన సూచించారు. జిల్లాలోని ఇల్లందు మండలంలో పలు పంచాయతీలను ఆదివారం ఆమె పరిశీలించారు. గ్రామపంచాయతీలో పేరుకుపోయిన చెత్తను సిబ్బంది అధికారులతో కలిసి వారు స్వయంగా తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం రూపొందించిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతి ఒక్కరు పంచాయతీలలో పారిశుద్ధ్య లోపం లేకుండా కాలువలను శుభ్రం చేయాలని సూచించారు. పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి గ్రామాలను స్వచ్ఛత వైపు ముందుకు తీసుకెళ్లాలని పూర్తి చేశారు. పచ్చదనం పరిశుభ్రత ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande