
రాజమహేంద్రవరం, 08 మార్చి (హి.స.)
: బొమ్మూరు ట్రాన్స్కో స్టోర్స్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే వినియోగించి తీసుకొచ్చిన స్క్రాప్ మీటర్లు ఉంచిన చోట ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలికి చేరుకున్న 6 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేస్తున్నాయి. రాజమహేంద్రవరం ట్రాన్స్కో ఎస్ఈ తిలక్ ఘటనాస్థలికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొత్తానికి ఇక్కడి నుంచే విద్యుత్ సరఫరా అవుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ