తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర గొప్పది: కేసీఆర్
హైదరాబాద్, 08 మార్చి (హి.స.) తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర గొప్పదని బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, మాజీ సీఎం కేసీఆర్ కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ
కేసీఆర్


హైదరాబాద్, 08 మార్చి (హి.స.)

తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర గొప్పదని బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, మాజీ సీఎం కేసీఆర్ కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ అభివృద్ధిలో పురుషుడితో సమానంగా స్త్రీ భాగస్వామ్యం ఇమిడి ఉందన్నారు. సంతానోత్పత్తి అనే అనివార్యమైన ధర్మాన్ని పాటించవలసిన బాధ్యతను ప్రకృతి స్త్రీకి కేటాయించిందని వివరించారు. అనేక కష్టాలతో మానవ మనుగడను నిలబెట్టే ప్రత్యేకమైన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న ప్రతీ మహిళా త్యాగశీలేనన్నారు. ఆకాశంలో సగం తానై.. అపారమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్న మహిళా లోకానికి అన్నిరంగాల్లోనూ పురుషుడితో సమానమైన అవకాశాల్ని మరింత అందించినపుడే కుటుంబాభివృద్ధి సంపూర్ణంగా జరుగుతుందన్నారు. స్త్రీలకు సమానమైన అవకాశాలు ఇచ్చినపుడు సమాజం ఫరిడవిల్లుతుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో మహిళా సాధికారతే లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేశామని గుర్తుచేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మహిళా సాధికారతను మరింత పెంచేలా కృషి చేయాలని సూచించారు.

వారిని కూడా మనుషులుగా గుర్తించి గౌరవించండి.. మహిళా దినోత్సవం సందర్భంగా కేటీఆర్...

మహిళలను తల్లి, చెల్లె, కుమార్తె అనే భావంతో మాత్రమే కాకుండా.. వారిని కూడా మనుషులుగా గుర్తించి గౌరవించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ (ఎక్స్) వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. కీలక సందేశమిచ్చారు.

మహిళలు కూడా మనలాగే మనుషులు, వారికి మనలా సమాన హక్కులు ఉండాలని, వారిని కూడా గౌరవించాలని అంగీకరించిన రోజున ప్రపంచం మరింత మంచి స్థలంగా మారుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మహిళలు తమ ప్రాథమిక హక్కుల కోసం పోరాడాల్సిన దుస్థితి నుంచి బయటపడేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మంచి మనుషులుగా మారాలని, మహిళలకు గౌరవం ఇవ్వాలని సంకల్పించుకోవాలని పిలుపునిచ్చారు. బలమైన మహిళలు సమాజంలో మరింత ఎదిగి, అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande