
అమరావతి, 08 మార్చి (హి.స.)
విజయవాడ,: విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి మహా కుంభాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంద్రకీలాద్రిపై పవిత్రమైన కార్యక్రమంలో తాను పాల్గొనటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ఈ మహా కుంభాభిషేకం ముగిసిందని తెలిపారు. ఈ నెల 6,7 తేదీల్లో అన్ని పూజలు నిర్వహించారని వివరించారు. నేడు పవిత్ర జలాలతో విమాన గోపురానికి అభిషేకం చేశారని ప్రస్తావించారు. కంచి పీఠాధిపతులు శంకర్ విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందని తెలిపారు. సనాతన ధర్మ ప్రకారం అన్ని పూజాకార్యక్రమాలు జరిగాయని వెల్లడించారు. మంత్రాలయంలో ప్రత్యేకంగా రెండు గంటలపాటు మూల విరాట్కి పూజలు నిర్వహించారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ