
హైదరాబాద్, 08 మార్చి (హి.స.) తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్థిక
సహాయం కింద అమలు చేస్తున్న రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంట సాగుకు సహాయంగా అందించే రైతు భరోసా డబ్బుల కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. రబి పంటల సాగు సమయానికి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జరగ్గా ఆ సమయంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్లో రావడంతో మున్సిపల్ ఎలక్షన్లో ముగియగానే రైతు భరోసా విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగానే ప్రకటించిన విషయం తెలిసిందే. పంట చేతికి వచ్చే సమయం వచ్చినా గానీ రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అప్పులతో కాలం వెళ్లదీస్తున్న రైతులు..
రైతు భరోసా కింద ఒక్క పంటకు ఎకరానికి రూ 6 వేలు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. రైతులు ఎంతో ఆశతో పెట్టుబడి సాయం వస్తుందని ఎదురుచూసిన పంటలు వేసి సుమారుగా రెండు నెలలు గడిచిన గాని డబ్బులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేకసార్లు రైతు భరోసా పథకం నిరంతరంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలో సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలు రావడంతో ప్రచారంలో భాగంగా మున్సిపల్ ఎన్నికల తర్వాత నిధులు విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సుమారు మూడు సార్లు రైతు భరోసా డబ్బులు రైతులకు అందలేదు. దీంతో ఆ డబ్బులు వస్తేనే ఎరువులు కొనుగోలు చేస్తామని అనుకున్న చిన్న సన్న కారు రైతులు అప్పులు చేసి మరి ఎరువులు కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
ప్రస్తుతం ఎకరానికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు భరోసా ఆపుతామని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. మేమెందుకు ఆపుతామని కచ్చితంగా రైతు భరోసా ఇచ్చి తీరుతాం అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక సుమారుగా మూడు సార్లు రైతు భరోసా నిధులు విడుదల చేయలేదు. రైతులకు భరోసాతో కనీసం ఎరువులు కొనుక్కునే సౌకర్యం ఉండేది. ప్రస్తుతం రైతు భరోసా ఇవ్వకపోవడంతో రైతులు అప్పులు చేసి మరి ఎరువులు కొనుక్కునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు ఉంటేనే పథకాలు సంపూర్ణంగా అమలు అవుతాయని విషయాన్ని రాష్ట్ర రైతులు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు