
అనంతపురం, 08 మార్చి (హి.స.)
జిల్లా గుత్తిలో ఆదివారం ఓ ఇంట్లో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి, వజ్రాలతోపాటు కొంత నగదును ఎత్తుకెళ్లారు. అనంతపురం రోడ్డులోని కాలనీలో నివాసం ఉంటున్నరమేష్ -సుమతి దంపతులు చర్చికి వెళ్లారు. ఇది గమనించిన దుండగులు పథకం ప్రకారం ఇంటి తాళాలు పగులగొట్టి రెండు తులాల బంగారం, తొమ్మిది వజ్రాలు, వెండి ఆభరణాలను అపహరించారు. చర్చి నుంచి ఇంటికి వచ్చి చూసిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సురేష్ బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ