
అమరావతి, 08 మార్చి (హి.స.) ప్రపంచమంతా ఐటీ(IT) నుంచి ఏఐ(AI) వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. మొత్తం భవిష్యత్తును ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) పూర్తిగా మార్చేయబోతోంది. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఏఐ కీలకం కాబోతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు దృష్ట్యా ఏపీ ప్రభుత్వం ఏఐ యుగంలోకి అడుగులు వేసింది. తొలుత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రయోగాత్మకంగా ఏఐ యుగానికి శ్రీకారం చుట్టింది. స్టార్టప్ సంస్థల ద్వారా 18 ఆస్పతుల్లో ఆవిష్కరణలు చేసింది. ఇందుకు 40 పరికరాలను వినియోగించేందుకు సిద్ధమైంది. తద్వారా 15 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనుంది. కేన్సర్తో పాటు గుండె, టీబీ, తదితఱ వ్యాధులను ఏఐ ద్వారా గుర్తించనున్నారు.
ఈ ఆధునాతన టెక్నాలజీ ద్వారా ఇక నుంచి రోగులకు వైద్య సేవలు చేసేందుకు సిద్ధమయ్యారు. అతి తక్కువ సమయంలో వ్యాధి నిర్ధారణ చేయడంతో పాటు అత్యంత మెరుగైన చికిత్సలు అందించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు రాష్ట్రంలో తొలి అడుగు వేశారు. ఈ ఏఐ ద్వారా రోగులకు మరిన్ని వైద్య సేవలు అందించేందుక రాష్ట్ర వైద్య శాఖ అధికారులు కృషి చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV