
అమరావతి, 09 మార్చి (హి.స.)కూటమి సర్కారు దివ్యాంగులకు ఉగాది కానుక అందించనుంది. మార్చి-19 సందర్భంగా 18వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటివరకు మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం అమలవుతుండగా ఇక నుంచి దివ్యాంగులకు ఈ సౌకర్యం అందనుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అవకాశం కల్పిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ