నాణ్యతలేని మందులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు..
నాణ్యతలేని మందుల విక్రయాన్ని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ఆధ్వర్యంలో బల్క్ ఎస్ఎంఎస్ అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించారు.
Logo TG


హైదరాబాద్, 09 మార్చి (హి.స.)నాణ్యతలేని మందుల విక్రయాన్ని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ఆధ్వర్యంలో బల్క్ ఎస్ఎంఎస్ అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించారు. ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపులకు వెంటనే సమాచారం అందించేలా చర్యలు తీసుకున్నారు

రాష్ట్రంలో ఎక్కడైనా నాణ్యతలేని, అనుమానాస్పద మందులు గుర్తించిన వెంటనే అన్ని మెడికల్ షాపులకు ఎస్ఎంఎస్ ద్వారా అలర్ట్ పంపిస్తున్నారు. దీంతో ఆ మందుల విక్రయాన్ని వెంటనే నిలిపివేయాలని మెడికల్ షాపులకు సూచనలు అందుతాయి.

ఈ కొత్త వ్యవస్థకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపులను ప్రభుత్వం అనుసంధానం చేస్తోంది. ఒకసారి అలర్ట్ జారీ అయిన వెంటనే ప్రతి ఫార్మసీకి సమాచారం చేరేలా డిజిటల్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.

ఔషధాల నాణ్యత, పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు డిజిటల్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆధునిక వ్యవస్థలను ప్రవేశపెట్టి మందుల నియంత్రణను మరింత కట్టుదిట్టం చేసేలా డీసీఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande