తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ధర్నా
మేడ్చల్, 09 మార్చి (హి.స.) మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలోని కిష్టాపూర్-పూడూర్ డివిజన్ ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ
BRS


మేడ్చల్, 09 మార్చి (హి.స.)

మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలోని కిష్టాపూర్-పూడూర్ డివిజన్ ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఖాళీ కుండలు, బిందెలతో నిరసన తెలుపుతూ కొన్ని కుండలను పగులగొట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్ మేడ్చల్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంశ్ కాళ్లు మొక్కుతూ ప్రజల తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని వేడుకున్నారు. అనంతరం ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఎండాకాలం ప్రారంభం కాకముందే అనేక ప్రాంతాల్లో మంచినీరు అందడం లేదని, కొన్నిచోట్ల డ్రైనేజీ కలిసిన నీరు వస్తోందని తెలిపారు. పారిశుధ్య సమస్యల పై అధికారులను అడిగితే వాహనాలకు డీజిల్ లేదని సమాధానం ఇస్తున్నారని విమర్శించారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందేదని భాస్కర్ యాదవ్ పేర్కొన్నారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పలుమార్లు జలమండలి మరియు అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో విలీనం చేసిన తర్వాత ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కోట్ల

రూపాయల పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande