
మహబూబ్నగర్, 09 మార్చి (హి.స.)
అబ్దుల్ కలాం చేంజ్ ద మేనిఫెస్టో అనే పుస్తకాన్ని రాశారు... మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డిని చూసిన తర్వాతే ఆ పుస్తకాన్ని రాసారేమో అన్నట్లుగా ఉంది అని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లాలోని ఆయా పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థులకు మహబూబ్ నగర్ పేస్ట్, వందేమాతరం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 45 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలను లక్ష్మీనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధి ఎలా ఉండాలి..!? ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఎన్ని ప్రైవేట్ బిల్స్ పై చర్చిస్తున్నారు.
నియోజకవర్గ ప్రజలకు ఏ మేరకు అందుబాటులో ఉంటున్నారు.. వారందరిని ఎలా ఏకతాటి పై నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు వంటి అంశాలు చేంజ్ మేనిఫెస్టోలో ఉన్నాయని లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ లక్షణాలు అన్ని ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డిలో ఉన్నాయని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆయన పనితీరును గురించి తెలుసుకున్నాను. ఇప్పటికే 2000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, విద్యార్థులకు అవగాహన తరగతులు, 90 రోజుల అభివృద్ధి కార్యక్రమాలు తదితరాలను గురించి అడిగి తెలుసుకున్నాను.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు