తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం!
హైదరాబాద్, 09 మార్చి (హి.స.) ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నామినేషన్లు వేయడం, వాటి పరిశీలన పూర్తవ్వగా.. నేటితో నామినేషన్ల విత్ డ్రా గడువు కూడా ముగియనుంది. ఈ క్రమంలో తెలంగాణ నుంచి ఇద్దర
Rajyasabha


హైదరాబాద్, 09 మార్చి (హి.స.)

ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం

రాజ్యసభ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నామినేషన్లు వేయడం, వాటి పరిశీలన పూర్తవ్వగా.. నేటితో నామినేషన్ల విత్ డ్రా గడువు కూడా ముగియనుంది. ఈ క్రమంలో తెలంగాణ నుంచి ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా సాయి నామినేషన్లు వేశారు. సింఘ్వీ మూడు సెట్లు, వేం నరేందర్ రెడ్డి నాలుగు సెట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి సాయి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేల మద్దతు లేకుండా నామినేషన్ వేయడంతో.. సాయి నామినేషన్ స్క్రూటినీ దశలోనే తిరస్కరణకు గురైంది.

బీఆర్ఎస్, బీజేపీలకు కోరం లేకపోవడంతో ఈ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు దూరంగా ఉన్నాయి. దీంతో అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిల ఎన్నిక ఖరారైంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల విత్ డ్రా కు గడువు ఉండగా.. సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. రాజస్థాన్ కు చెందిన సింఘ్వీ తెలంగాణ నుంచి సిట్టింగ్ మెంబర్ కొనసాగుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande