
షాద్నగర్, 09 మార్చి (హి.స.)
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు, భవిష్యత్తు ప్రణాళికల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి పట్టణ ముఖ్య కూడలి వరకు నిర్వహించిన 5కె రన్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తు ప్రణాళికలను ప్రజలకు వివరించి వారిని భాగస్వామ్యం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాల సాధన ధ్యేయంగా సాగిన ఈ 5కే రన్ లో పాఠశాల విద్యార్థులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 5కే రన్ లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పై నినాదాలు చేస్తూ, ప్రజలకు తెలియజేస్తూ రన్ కొనసాగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు