మార్చి 24 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలు.. సిద్దిపేట పోలీస్ కమిషనర్
సిద్దిపేట, 09 మార్చి (హి.స.) సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో మార్చి 24వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. పైన పేర్క
Siddipet cp


సిద్దిపేట, 09 మార్చి (హి.స.)

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో మార్చి 24వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. పైన పేర్కొన్న కార్యక్రమాల నిర్వహణకు ముందుగా సంబంధిత ఏసిపి అనుమతి తీసుకోవాలన్నారు. బంద్ ల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు మార్చి 24వ తేదీ వరకు అమల్లో ఉంటుందన్నారు. పై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 223 బి ఎన్ ఎస్, సెక్షన్ 70(A), 70(B) 70 C, 76, సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫాస్లి సెక్షన్ 76, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిపి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande