క్రీడాశాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. స్పోర్ట్స్ వర్సిటీ డిజైన్ల పరిశీలన
క్రీడాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు.
Revanth reddy


హైదరాబాద్, 09 మార్చి (హి.స.)క్రీడాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పనపై అధికారులతో చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని రకాల క్రీడలకు మైదానాల ఏర్పాటుపై మాట్లాడారు. వర్సిటీ నిర్మాణాలకు సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించారు. దీనికి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.

‘‘అన్ని సదుపాయాలతో స్పోర్ట్స్ వర్సిటీ నిర్మాణాలు ఉండాలి. ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఒలింపిక్స్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటేలా చర్యలు తీసుకోవాలి. కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియాన్ని ఆధునికీకరించాలి. అదేవిధంగా గచ్చిబౌలి ఔట్డోర్ స్టేడియాన్ని పునరుద్ధరించాలి’’ అని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande