ఫీజు రీయింబర్స్మెంట్కు దిక్కులేదు కానీ ఈవీ స్కూటర్ల హామీలా? సీఎంపై బండి ఫైర్
హైదరాబాద్, 09 మార్చి (హి.స.) విద్యార్థినులకు త్వరలోనే ఎలక్ట్రిక్ కాలేజీ స్కూటీలు అందించ బోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శలు గుప్పించారు. సీఎం పూటకో మాట మారుస్తున్నా
బండి సంజయ్


హైదరాబాద్, 09 మార్చి (హి.స.)

విద్యార్థినులకు త్వరలోనే ఎలక్ట్రిక్ కాలేజీ స్కూటీలు అందించ బోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శలు గుప్పించారు. సీఎం పూటకో మాట మారుస్తున్నారని దుయ్యబట్టారు. కాలేజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. కానీ సీఎం మాత్రం ఉచిత ఈవీ స్కూటర్లు ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారని నిలదీశారు. అలాగే పేదలు, దళిత, గిరిజనులుక ఇవ్వడానికి భూములు లేవని చెబుతున్న అదే రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు, మూసీ బాధితులకు భూములు ఇస్తామని చెబుతున్నారు. పెన్షన్లు చెల్లించడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెబుతూనే ఓవైసీ ఒక్క పిలుపునిస్తే మూసీ ప్రాజెక్టు కోసం వేల కోట్లు ఏర్పాటు చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే ఒక విషయం మాత్రం వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోమల బెడత పెరిగిందని ప్రజలు చెబుతున్నారు. మన పని మనం చేసుకుంటున్నా దోమల మాదిరిగా కాంగ్రెస్ ఎక్కడినుంచో వచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు.

కాగా నిన్న ప్రజా భవన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని జర్నలిస్టులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇండ్ల స్థలాలు ఇస్తామన్నారు. అలాగే కాలేజీలకు వెళ్లే ఆడపిల్లలకు ఈవీ స్కూటీలు త్వరలో అందిస్తామని ప్రకటించారు.మూసీ నిర్వాసితులైన మధుపార్క్ అపార్ట్ మెంట్ వాసులకు నష్టం జరగకుండా ప్రత్యామ్నాయంగా భూమి, భవన నిర్మాణాలకు నిధులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే ఇటీవల పలు వేదికలపై సీఎం మాట్లాడుతూ పంచిపెట్టేందుకు ప్రభుత్వం భూములు లేవని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎక్స్ వేదికగా స్పందించిన బండి సంజయ్ సీఎం మాటలు మారుస్తున్నారంటూ దుయ్యబట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande