
తాడేపల్లి, 09 మార్చి (హి.స.)ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకున్నారు. తాడేపల్లి రిటైనింగ్ వాల్ కు శంకుస్థాపన చేశారు. రూ.294.20 కోట్లతో వరద రక్షణ గోడ నిర్మాణం కోం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ రక్షణ గోడను కృష్ణానదికి కుడివైపుగా ప్రకాశం బ్యారేజీ దిగువన 0.9 కిలోమీటర్ల దూరం నుంచి 2.610 కిలోమీటర్ల వరకూ నిర్మించనున్నారు. గత ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ముంపు ప్రాంతాల ప్రజలకు వరద ముప్పు నుంచి శాశ్వత పరిష్కారం చూపిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.
కృష్ణానదికి వరదలు వచ్చిన ప్రతిసారీ తాడేపల్లి పరిధిలోని పలు నివాస ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ఈ గోడ నిర్మాణంతో వేలాది కుటుంబాలకు వరద ముప్పు తప్పుతుంది. సుమారు 20 అడుగులకు పైగా ఎత్తుతో నిర్మించే ఈ గోడ, నది ఉధృతిని తట్టుకుని లోతట్టు ప్రాంతాలకు రక్షణగా నిలుస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని, వెంటనే రిటైనింగ్ వాల్ పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. ప్రజల రక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా రిటైనింగ్ వాల్ పనులు పూర్తి చేయాలని వర్కర్లకు ఆదేశాలిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV