తిరుమలలో భక్తుల రద్దీ ఫుల్.. శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం
తిరుమల, 09 మార్చి (హి.స.)తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోగా.. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 8-12 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. అలాగే సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటలు, రూ.300 శ
తిరుమల


తిరుమల, 09 మార్చి (హి.స.)తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోగా.. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 8-12 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. అలాగే సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటలు, రూ.300 శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుందని తెలిపింది. నిన్న స్వామివారిని 77,879 మంది భక్తులు దర్శించుకోగా.. 25,520 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం స్వామివారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు సమకూరింది.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఇటీవలే తన కుమారుడి పెళ్లి జరగ్గా.. కొత్త దంపతులకు శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు తెలిపారు. త్వరలోనే తెలంగాణ బడ్జెట్ ను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడుతున్నామని, ప్రపంచంతో పోటీ పడేలా ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి ఉంటుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande