ప్రధాని మోదీ హత్యకు కుట్ర ముగ్గురు నిందితుల అరెస్టు
బీహార్లోని బక్సర్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు పన్నిన ఒక భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు
PM Narendra Modi Addressing a huge rally in Biswanath.


బీహార్, 10 ఏప్రిల్ (హి.స.)బీహార్లోని బక్సర్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర

మోదీని హత్య చేసేందుకు పన్నిన ఒక భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. కేంద్ర నిఘా

వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో బక్సర్ జిల్లా పోలీసులు మెరుపు దాడి చేసి

ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

ఈ కుట్రలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నఅమన్ తివారీ (అలియాస్ అమన్

కుమార్) తో పాటు అతని ఇద్దరు సహచరులను సిమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశా

ప్యాడ్రి గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమన్ తివారీ గతంలోనే నేర

చరిత్ర కలిగిన వ్యక్తి. 2022లో కోల్కతా విమానాశ్రయంపై దాడికి ప్లాన్ చేసిన

కేసులో ఇతను అరెస్టయ్యాడు. అప్పట్లో మైనర్ కావడంతో చట్టపరమైన ఊరట లభించినప్పటికీ, మళ్ళీ ఇప్పుడు దేశ ప్రధానిని లక్ష్యంగా చేసుకుని కుట్ర

పన్నడం సంచలనం సృష్టించింది.

నిందితుడు అమన్ తివారీ, ప్రధాని మోదీని

హతమార్చేందుకు ఒక ప్రతిపాదనను అమెరికన్ నిఘా సంస్థ అయిన CIA కి ఈమెయిల్ ద్వారా పంపినట్లు దర్యాప్తులో తేలింది. ఈ

పనిని పూర్తి చేయడానికి అతను భారీ మొత్తంలో డబ్బును డిమాండ్ చేయడమే కాకుండా, తన ప్లాన్ అమలు చేయడానికి 22 రోజుల సమయంకావాలని కోరాడు. ఈ ఈమెయిల్ కమ్యూనికేషన్ను కేంద్ర నిఘా

సంస్థలు పసిగట్టి వెంటనే బీహార్ పోలీసులను అప్రమత్తం చేశాయి.

బక్సర్ ఎస్పీ శుభమ్ ఆర్య నేతృత్వంలో పోలీసులు నిందితుల

నివాసాలపై దాడులు నిర్వహించి ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు

మరియు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇంటర్నెట్ ద్వారా

ఎవరితోనైనా టచ్లో ఉన్నారా లేదా అనే కోణంలో ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతోంది.

ప్రస్తుతం నిందితులను రహస్య ప్రాంతంలో ఉంచి జాతీయ దర్యాప్తు

సంస్థ (NIA) మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారులు విచారిస్తున్నారు. వీరి వెనుక ఏదైనా అంతర్జాతీయ

ఉగ్రవాద ముఠా ఉందా? లేక కేవలం డబ్బు కోసం ఈ కుట్రకు పాల్పడ్డారా? అనే విషయా

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande