ఆశాభోంస్లే మరణంపై విచారం వ్యక్తం చేసిన మోదీ
ఆశాభోంస్లే మరణం తనని తీవ్రంగా కలిచివేసిందని మోదీ అన్నారు
ఆశాభోంస్లే మరణంపై విచారం వ్యక్తం చేసిన మోదీ


న్యూఢిల్లీ, 12 ఏప్రిల్ (హి.స.)

ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. భారతదేశం చూసిన అత్యంత ప్రసిద్ధ, బహుముఖ ప్రజ్ఞావంతురాలైన గాయకులలో ఆశా భోంస్లే ఒకరని మోదీ కొనియాడారు.

భారతదేశం గర్వించదగ్గ బహుముఖ ప్రజ్ఞాశాలి, దిగ్గజ గాయకులలో ఒకరైన ఆశా భోంస్లే గారి మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.

దశాబ్దాల పాటు సాగిన ఆమె అసాధారణ సంగీత ప్రస్థానం మన సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హృదయాలను ఆమె తన గానంతో స్పృశించారు. ఆర్ద్రతతో కూడిన మెలోడీలు అయినా, ఉత్సాహభరితమైన గీతాలైనా, ఆమె గొంతులో కాలాతీతమైన ప్రతిభ దాగి ఉంది.

ఆమెతో నాకున్న పరిచయాన్ని, సంభాషణలను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.

ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఆమె పాటలు ప్రజల జీవితాల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి అంటూ ప్రధాని తన ట్వీట్ లో కీర్తించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande