
న్యూఢిల్లీ, 11 ఏప్రిల్ (హి.స.)
రాజకీయంగా ఎప్పుడూ ఒకరిపై ఒకరు కనిపించి విమర్శలు చేసుకునే ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇవాళ పార్లమెంట్ ఆవరణలో ఒకే ఫ్రేమ్లో అందరినీ ఆశ్చర్యపరిచారు. 'ప్రేరణా స్థల్' (Prerna Sthal) వేదికగా చోటుచేసుకున్న ఈ రాజకీయ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహాత్మ జ్యోతిబా పూలే (Mahatma Jyotiba Phule) 200వ జయంతి సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇరువురు నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రేరణా స్థల్కు చేరుకున్న ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఒకరికొకరు తారసపడ్డారు.
అయితే, రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, ప్రధాని మోదీ తొలుత లోక్సభా పక్ష నేత రాహుల్ గాంధీని పలకరించారు. వెంటనే స్పందించిన రాహుల్ కూడా ప్రధానికి నమస్కరించారు. అనంతరం ఇరువురు నేతలు కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. వారి ముఖాల్లోని చిరునవ్వులు, స్నేహపూర్వక సంభాషణ అందరినీ ఆకట్టకుంది. స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం అందకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో తెగ వైరల్ అవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..