
అయోధ్య, 12 ఏప్రిల్ (హి.స.)
రామభక్తుల చిరకాల ఆకాంక్ష ఎట్టకేలకు నెరవేరింది. అయోధ్య రాముని ఆలయ నిర్మాణం పూర్తయినట్లు నిర్మాణ కమిటీ ప్రకటించింది. దాదాపు రూ.1,800 కోట్లతో ఆలయ నిర్మాణం పూర్తి చేశామని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర ధ్రువీకరించారు. ఆలయ నిర్మాణ బాధ్యతను తమకు 2020లో లాంఛనంగా అప్పగించినా అందుకు సంబంధించిన ఏర్పాట్లు చాలా ముందు నుంచే మొదలయ్యాయని తెలిపారు. న్యాయపరమైన చిక్కుముడులు తదితర కారణాల రీత్యా ఒక దశలో ఆశలు సన్నగిల్లినా దైవ నిర్ణయంతో నిర్మాణం పూర్తయిందని చెప్పారు. తొలుత రామ్ లల్లా విగ్రహాన్ని కలపతో చేసిన చట్రం వంటి తాత్కాలిక నిర్మాణంలో స్థాపించారు. ఆ ప్రదేశాన్ని ఇప్పుడు సురక్షిత ప్రాంతంగా ప్రకటించి అందులో అఖండ జ్యోతిని ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ