
బెంగళూరు, 12 ఏప్రిల్ (హి.స.)సాధారణ బిస్కెట్ల కంటే క్రీమ్ బిస్కెట్లను పిల్లలు ఇష్టపడతారు. లోపల ఉండే క్రీమ్ అంటే వారికి చాలా ఇష్టం. అది ఎంతో తియ్యగా ఉంటుంది. పిల్లలు మారాం చేస్తే తల్లిదండ్రులు కొనిస్తారు. కానీ అలా కొనివ్వడం పిల్లల ఆరోగ్యాన్ని పాడుచేయడమేనని చెబుతున్నారు పోషకాహార నిపుణులు డా బి ఎస్ అనురాధ. బిస్కెట్లే ఆరోగ్యకరమైనవి కావు. అందులో క్రీమ్ బిస్కెట్లు మరింత హానికరం. క్రీమ్ బిస్కెట్లు ఎందుకు తినకూడదో తెలుసుకోండి.
మనం రోజూ కొనే క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ల మీద ఉండే ఒక చిన్న పదం వెనుక ఎంతటి భారీ మోసం దాగి ఉందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. నిజానికి ఫుడ్ నిబంధనల ప్రకారం, ‘Cream’ అని రాయాలంటే అది పాల నుంచి తీసిన మీగడ లేదా పాల కొవ్వుతో తయారై ఉండాలి. కానీ, మార్కెట్లో లభించే అత్యధిక శాతం బిస్కెట్ ప్యాకెట్ల మీద ‘Cream’ కు బదులుగా ‘Crème’ అని రాసి ఉంటుంది. వినడానికి రెండు ఒకేలా ఉన్నా.. ఈ చిన్న మార్పుతో కంపెనీలు చట్టపరమైన చిక్కుల నుంచి తప్పించుకుంటూ వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నాయి. ‘Crème’ అని రాసి ఉన్న ప్యాకెట్లలో పాలతో చేసిన క్రీమ్ అణువంత కూడా ఉండదు. అది కేవలం పామాయిల్ మరియు వెజిటబుల్ ఫ్యాట్స్, విపరీతమైన చక్కెర, కృత్రిమ రంగులు, ఫ్లేవర్లు వీటన్నింటినీ కలిపి తయారు చేసిన ఒక రసాయన మిశ్రమం మాత్రమే. చూడటానికి, రుచికి క్రీమ్లా ఉన్నా.. ఇందులో పోషకాలు సున్నా, హండ్రెడ్ పర్సంట్ అనారోగ్యం. పాల క్రీమ్ వాడకుండా ప్యాకెట్పై ‘Cream’ అని రాస్తే ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం కేసులు నమోదవుతాయి. అందుకే కంపెనీలు తెలివిగా ‘Crème’ అనే ఫ్యాన్సీ పదాన్ని వాడుతున్నాయి.
ఇది చదవడానికి స్టైలిష్గా ఉన్నా.. లోపల ఉన్నది మాత్రం కేవలం నూనెల మిశ్రమమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నకిలీ క్రీమ్ బిస్కెట్లను తినడం వల్ల చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే పామాయిల్ ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్యాకెట్ ముందు ఉన్న ఆకర్షణీయమైన బొమ్మలను, పేర్లను చూసి మోసపోకండి. వెనుక తిప్పి చూడండి. ప్యాకెట్ వెనుక ఉండే ‘Ingredients List’ తప్పకుండా చదవండి. ఇంగ్రేడి
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV