ప్రమాదాలు నివారించాలి.. విలువైన ప్రాణాలను రక్షించాలి.. డిజిపి శివధర్ రెడ్డి
నిజామాబాద్, 14 ఏప్రిల్ (హి.స.) మనిషి ప్రాణం చాలా విలువైనదని.. ఆ ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44 వ జాతీయ రహదారిపై చంద్రాయన్ పల
Dgp


నిజామాబాద్, 14 ఏప్రిల్ (హి.స.)

మనిషి ప్రాణం చాలా విలువైనదని.. ఆ ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44 వ జాతీయ రహదారిపై చంద్రాయన్ పల్లి గ్రామం వద్ద వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థ (వీఐడిఎస్) ను మంగళవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తూ.చా తప్పకుండా పాటించాలన్నారు. హెల్మెట్లు తప్పనిసరి ధరించాలని, పిల్లలకు కూడా హెల్మెట్లు ధరింపజేసి ప్రయాణించాలనిడీజీపీ సూచించారు. రోడ్డు ప్రమాదాలు నివారించడంతో విలువైన ప్రాణాలను రక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం ముందుగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

జాతీయ రహదారిపై డిఫెన్స్ డ్రైవింగ్ తప్పకుండా పాటించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు, సూచనలు పాటిస్తూ ప్రయాణం చేయాలన్నారు.ఓకే మార్గంలో వెళుతున్న వాహనాల మధ్య డిస్టెన్స్ మెయింటెన్ చేయాలన్నారు. వాహనం వేగంగా వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మనపై ఆధారపడ్డ భార్యా బిడ్డలకు, ఇతర కుటుంబ సభ్యులకు కన్నీరు మిగిల్చకుండా చూడాలన్నారు. సీటు బెల్టు తప్పనిసరి ధరించాలని డీజీజీ సూచించారు. ఈ నిబంధనలు ఇతరులకు కూడా తెలిసేలా అవగాహన కల్పించాలన్నారు. గ్రామ ప్రజలతో అరైవ్.. అలైవ్ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రతిజ్ఞ చేయించారు. . అనంతరం విఐడిఎస్ కు సంబంధించిన ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను ప్రారంభించారు. ఈ వ్యవస్థ మానవ ప్రమేయం లేకుండా ట్రాఫిక్ ను నిరంతరం పర్యవేక్షిస్తుందని, ఏఐ విశ్లేషణలతో కూడిన హై-డెఫినిషన్ నిఘా కెమెరాలను ఉపయోగిస్తుందని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande