
అమరావతి, 14 ఏప్రిల్ (హి.స.)దేశంలోనే తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీ, గన్నవరం మేధాటవర్స్లో ఏర్పాటు చేసిన క్వాంటం టెస్ట్బెడ్స్ను ఎస్ఆర్ఎం వర్సిటీ నుంచి ఆయన ప్రారంభించారు. 1ఎస్, 1క్యూ క్వాంటం టెస్ట్బెడ్స్ను సీఎం జాతికి అంకితం చేశారు. దీంతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
దీనికి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహకారం అందించింది. ఈ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్ సభ్యులు సహా ఐఐటీ ప్రొఫెసర్లు, క్వాంటం రంగ శాస్త్రవేత్తలు, క్వాంటం ఇన్నోవేషన్ స్టార్టప్ల ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు, నిపుణులు హాజరయ్యారు. ఏపీలోని వివిధ వర్సిటీలు, కాలేజీల నుంచి వర్చువల్గా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్