నిప్పుల కొలిమిలా మారిన ఏపీ
ఏపీలో ఎండతీవ్రత నానాటికీ పెరిగిపోతోంది
ఎండ


అమరావతి, 14 ఏప్రిల్ (హి.స.)ఏపీలో సూర్యుడు ప్రతాపం చూపిస్తుండటంతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ కూడా రాయలసీమ, కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా 33 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, మరో 44 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.

విపత్తుల నిర్వహణ సంస్థ నివేదిక ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లాలో 15, విజయనగరం జిల్లాలో 9, శ్రీకాకుళంలో 4, పోలవరంలో 3, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1, ఏలూరు జిల్లాలోని ఒక మండలంలో తీవ్ర వడగాలుల ప్రభావం ఉండనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande