ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని గ్రామీణ పేదల కోసం.మరో కీలక నిర్ణయం
నేడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్న సీఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని గ్రామీణ పేదల కోసం.మరో కీలక నిర్ణయం


అమరావతి, 15 ఏప్రిల్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ పేదల కోసం మరో కీలక నిర్ణయానికి నేడు శ్రీకారం చుడుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 62 అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు నేడు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. పేదలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ఈ అన్న క్యాంటీన్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం విదితమే కాగా.. ఇప్పటి వరకు సిటీలు, పట్టణాలకు పరిమితమైన ఈ అన్న క్యాంటీన్లు.. ఇప్పుడు గ్రామాల్లో కూడా అందుబాటులోకి వస్తున్నాయి.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సీఎం చంద్రబాబు అమరావతికి చేరుకోనున్నారు. అనంతరం అక్కడి అన్న క్యాంటీన్ను సందర్శించి పేదలతో కలిసి భోజనం చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమవుతూ సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం కట్టుబడి ఉందని సందేశం ఇవ్వనున్నారు.

మరోవైపు సాయంత్రం ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం జరగనుంది.. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ హాజరుకానున్నారు.. రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానుండడం.. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులు పార్లమెంట్ ముందుకు రానున్న నేపథ్యంలో.. ఆ బిల్లులతో పాటు తాజా పరిణామాల పై చర్చించనున్నారు ఎన్డీఏ నేతలు..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande