ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల
ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్  ఫలితాల విడుదల


అమరావతి, 15 ఏప్రిల్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఫలితాలు విడుదల కావాల్సిన సమయం రానేవచ్చింది.. రాష్ట్రంలో మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఇంటర్ పరీక్షల ఫలితాలను ఈరోజు ఉదయం 10.31 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో సులభంగా చూసుకోవచ్చు. ఫలితాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధికారిక వెబ్సైట్ resultsbie.ap.gov.in ను సందర్శించి హాల్ టికెట్ నంబర్ నమోదు చేస్తే వెంటనే మార్కులు, గ్రేడ్లు తెలుసుకోవచ్చు.

అలాగే, విద్యార్థుల సౌకర్యార్థం వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునే అవకాశం కల్పించారు. మన మిత్ర సేవ ద్వారా 95523 00009 నంబర్కు “Hi” అని మెసేజ్ పంపితే వెంటనే ఇంటర్ ఫలితాలు అందుబాటులోకి వస్తాయి. దీంతో వెబ్సైట్లో ట్రాఫిక్ ఎక్కువైనా విద్యార్థులు సులభంగా రిజల్ట్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఫలితాల నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు మంత్రి నారా లోకేష్.. అయితే, ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలను దాదాపు 10.50 లక్షల మంది రాశారు.. దీంతో.. విద్యార్థులతో పాటు.. వారి పేరెంట్స్ కూడా ఆతృతగా ఇంటర్ ఫలితాల కోసం వేచిచూస్తున్నారు..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande