ఏపి ప్రభుత్వం పెన్షన్ల కోసం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏడాదికి 2400 కోట్లు ఖర్చు
ఏపి ప్రభుత్వం పెన్షన్ల కోసం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏడాదికి 2400 కోట్లు ఖర్చు
ఏపి ప్రభుత్వం పెన్షన్ల కోసం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏడాదికి 2400  కోట్లు ఖర్చు


విజయవాడ, 15 ఏప్రిల్ (హి.స.)

ఏపీ ప్రభుత్వం పెన్షన్ల కోసం ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏడాదికి అక్షరాల రూ.2400 కోట్లను ఖర్చు చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో 2,80,000 మందికి నెలకు రూ.18 కోట్ల చొప్పున పెన్షన్ చెల్లిస్తోంది. ఏడాదికి రూ.1,176 కోట్లను పేదలకు ఖర్చు చేస్తోంది. కృష్ణా జిల్లాలో 2,87,000 మందికి నెలకు రూ.102 కోట్లను ఖర్చు చేస్తోంది. ఏడాదికి రూ.1,224 కోట్లను పెన్షన్లకు ఖర్చు చేస్తోంది. పెన్షన్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఒక్కసారిగా రూ.3 వేల నుంచి రూ.4 వేలకు సాధారణ పెన్షన్లను పెంచింది. రూ.15 వేల వరకు వివిధ కేటగిరీల పెన్షన్లు ఇస్తుండటంతో ఎంతోమంది పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు.

పెన్షన్ల కోసం భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి.. మూడేళ్లుగా నూతన పెన్షన్కు అవకాశం లేకపోవటంతో గ్రామ, వార్డు సచివాలయాలు, డీఆర్ఏ, యూసీడీ, కలెక్టరేట్లకు వచ్చి దరఖాస్తులను సమర్పిస్తున్నారు. పెన్షన్ల కోసం వస్తున్న దరఖాస్తులు ఆయా కార్యాలయాల్లో గుట్టలుగా పడి ఉంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో 30 వేల పెన్షన్లకు దరఖాస్తులు చేసుకున్నట్లు డీఆర్డీఏ అధికారుల అంచనాగా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 22వేలు, కృష్ణాజిల్లాలో ఎనిమిది వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లాలో వచ్చిన 22 వేల దరఖాస్తుల్లో విజయవాడ నగరంలో పట్టణ సామాజిక అభివృద్ధి (యూసీడీ) విభాగానికి 10 వేలకు పైగా అర్జీలు వచ్చాయి.

ఉమ్మడి కృష్ణాజిల్లాలో గత మూడేళ్లుగా కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడంతో వృద్ధాప్య పెన్షన్లు పెరిగాయి. అరవై సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరూ పెన్షన్కు అర్హులు కావటంతో దరఖాస్తులు చేస్తున్నారు. కరోనా తర్వాత కారణాలు ఏవైనప్పటికీ మరణాల సంఖ్య పెరుగుతోంది. అకస్మాత్తుగా వచ్చే గుండెపోట్లు, అవయవాల వైఫల్యం ఇతర జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగింది. ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ కారణంగా వృద్ధాప్య వితంతు, ప్రమాదకర వ్యాధుల కేటగిరికి సంబంధించి పెన్షన్ల దరఖాస్తులు ఎక్కువుగా వస్తున్నాయి.

ఉమ్మడి జిల్లా డీఆర్డీఏ అధికారుల అంచనాల ప్రకారం 30 వేల దరఖాస్తులు అని చెబుతున్నా.. వాస్తవంగా వచ్చిన దరఖాస్తులపై స్పష్టత లేదు. ఎందుకంటే ముందుగా ప్రజలు గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్ల కోసం ఆర్జీలను సమర్పిస్తున్నారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సి ఉండటంతో... లాగిన్ ఇవ్వకపోవటంతో దరఖాస్తులను తమ దగ్గరే పెట్టుకుంటున్నారు. ఇక లాభం లేదని ఎంపీడీవో కార్యాలయాల్లో గ్రీవెన్స్కు వెళ్లి అక్కడ దరఖాస్తులు ఇస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande