నియోజకవర్గాల పునర్విభజన అంశం.. కేంద్రంపై స్టాలిన్ తీవ్ర ఆగ్రహం
నియోజకవర్గాల పునర్విభజన అంశం.. కేంద్రంపై స్టాలిన్ తీవ్ర ఆగ్రహం
M K Stalin


చెన్నై, 15 ఏప్రిల్ (హి.స.)నియోజకవర్గాల పునర్విభజన అంశంలో తమిళనాడు అభిప్రాయాలను పట్టించుకోకపోతే బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై ఆయన 'ఎక్స్' వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పునర్విభజన పేరుతో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

దేశాభివృద్ధికి కృషి చేసినందుకు గాను కేంద్రం దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తుందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో రేపు కేంద్రం ప్రవేశపెట్టాలని చూస్తున్న డీలిమిటేషన్ సవరణ బిల్లుపై దక్షిణాదికి చెందిన వారు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande