మహిళా రిజర్వేషన్కు మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ మద్దతు.. ప్రధాని మోదీకి లేఖ
మహిళా రిజర్వేషన్కు మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ మద్దతు.. ప్రధాని మోదీకి లేఖ
Pratibha Patil


న్యూఢిల్లీ, 15 ఏప్రిల్ (హి.స.) దేశవ్యాప్తంగా చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 'నారీ శక్తి వందన్ అధినియం' అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఈ తరుణంలో, భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈ ప్రక్రియకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక ప్రత్యేక లేఖ రాశారు. ఆమె తన లేఖలో కేంద్ర ప్రభుత్వ చొరవను కొనియాడారు:నారీ శక్తి వందన్ అధినియంను చారిత్రక రీతిలో అమలు చేసేందుకు మీరు తీసుకున్న చొరవను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని ఆమె పేర్కొన్నారు.

ఈ రాజ్యాంగ సవరణ భారత ప్రజాస్వామ్య చట్రాన్ని మరింత బలోపేతం చేస్తుందని, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం దేశాభివృద్ధికి కీలకమని ఆమె అభిప్రాయపడ్డారు. 2007 నుండి 2012 వరకు దేశ తొలి మహిళా రాష్ట్రపతిగా పనిచేసిన ప్రతిభా పాటిల్, తన పదవీ కాలంలో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకాభిప్రాయం కోసం నిరంతరం కృషి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కల సాకారం కాబోతుండటంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 16 నుంచి 18 వరకు నిర్వహించనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు-2026 ను ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా 2029 లోక్సభ ఎన్నికల కంటే ముందే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రతిభా పాటిల్ వంటి అగ్ర నేతల మద్దతు ప్రభుత్వానికి మరింత బలాన్ని చేకూర్చినట్లయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande