కొత్త జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాల
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
Mallikarjun Kharge


హైదరాబాద్, 15 ఏప్రిల్ (హి.స.)మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఇండియా కూటమి అనుకూలంగానే ఉందని.. కానీ దానిని తీసుకువచ్చే విధానంపైనే అభ్యంతరాలు ఉన్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే (Mallikarjun Kharge) పేర్కొన్నారు. రిజర్వేషన్‌ బిల్లుకు డీలిమిటేషన్‌ను ముడిపెట్టి కేంద్రం రాజకీయ కుతంత్రాలు చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగంలోని అధికారాలన్నింటినీ కార్యనిర్వాహక వర్గం తీసుకుంటోందన్నారు. కేవలం ప్రతిపక్ష పార్టీలను అణచివేయడానికే కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తోందన్నారు. ఖర్గే నివాసంలో నిర్వహించిన ఇండియా కూటమి నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు వ్యతిరేకంగా తామంతా పార్లమెంట్‌లో ఐక్యంగా పోరాడుతామని ఖర్గే పేర్కొన్నారు. కనీసం జనగణన కూడా పూర్తి చేయకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. కొత్త జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్‌ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande