మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర ఎదురుకాల్పులు
జార్ఖండ్లోని సారండా అటవీ ప్రాంతం
మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర ఎదురుకాల్పులు


రాంచీ, 15 ఏప్రిల్ (హి.స.): జార్ఖండ్‌లోని సారండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. చోటా నగర్ పోలీస్ స్టేషన్ పరిధి బాబుదేరా అడవిలో భద్రతా దళాలు కూంబింగ్ చేస్తుండగా ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున ఇరువర్గాలు ఎదురుపడ్డాయి. దీంతో వారి మధ్య ఎదురుకాల్పులు మెుదలయ్యాయి.

ఈ దాడిలో పలువురు మావోలకు బుల్లెట్ గాయాలు అయ్యాయని, మరికొంతమంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మిసిర్ బెస్రా కోసం బాబుదేరా అడవిలో సీఆర్పీఎఫ్ కోబ్రా బెటాలియన్, జార్ఖండ్ జాగ్వార్, జిల్లా పోలీస్ సంయుక్త బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఎన్‌కౌంటర్ జరిగింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande